YS Jagan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – జగన్
భోగాపురంలో ఎయిర్ పోర్టకు శంకుస్థాపన
YS Jagan : తాను గతంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. గతంలో విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు ఏమంటారంటూ ప్రశ్నించారు సీఎం. దీనిని ఏర్పాటు చేసేందుకు కొందరు అడ్డంకులు కల్పించారు. వాటన్నింటిని అధిగమించాం. ఇవాళ మీ ముందుకు వచ్చానని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan).
సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీల్లో కూడా కేసులన్నింటిని పరిష్కరించడం జరిగిందన్నారు. భూ సేకరణ కూడా పూర్తయిందని చెప్పారు జగన్ రెడ్డి. నిర్వాసితులకు ఇళ్లు కూడా కట్టించామని తెలిపారు. టెండర్లు కూడా పూర్తి చేశామని తెలిపారు సీఎం. గతంలో ప్రభుత్వం ఎయిర్ పోర్టు కోసం 15 వేల ఎకరాలు కావాలని కోరింది. కానీ నాడు తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేవలం 3 నుంచి 5 వేల ఎకరాలైతే సరి పోతుందని చెప్పానని గుర్తు చేశారు ఈ సందర్బంగా జగన్ రెడ్డి(YS Jagan).
అనంతరం జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున్ రావు ప్రసంగించారు. తనకు ఇవాళ సంతోషంగా ఉందని అన్నారు. తాను ప్రపంచంలో చాలా ఎయిర్ పోర్టులు కట్టానని , కానీ నా స్వంతూరు రాజాం, వైజాగ్ నా రెండో ఊరు అని చెప్పారు. తొలి ఎయిర్ పోర్టు హైదరాబాద్ లో కట్టానని, ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆయన తనయుడు సీఎం జగన్ ఇవాళ ఈ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయడం సంతోషం కలిగించిందని చెప్పారు.
Also Read : గాడి తప్పిన పాలన జనం ఆవేదన