PM Modi : శాంతికి..అభివృద్దికి కాంగ్రెస్ అవ‌రోధం

నిప్పులు చెరిగిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మ‌రోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. శాంతికి, అభివృద్దికి కాంగ్రెస్ అవ‌రోధ‌మ‌న్నారు. భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల‌ను అవ‌మానించిన ఘ‌న‌త ఆ పార్టీకే చెల్లింద‌న్నారు. గ‌తంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ లూటీ చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల‌ను విభజించి పాలించింద‌ని మండిప‌డ్డారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌ధాన మంత్రి బుధ‌వారం బీజేపీ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యానికి ఢోకా లేద‌న్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప‌దే ప‌దే డెమోక్ర‌సీపై దాడి చేయ‌డం త‌గ‌ద‌న్నారు. అందుకే ఆ పార్టీని ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌న్నారు. దేశంలో మెరుగైన పాల‌న ఒక్క త‌మ వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు మోదీ. మ‌రోసారి కూడా తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

కాంగ్రెస్ పార్టీకి విమ‌ర్శించ‌డం, ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప ఇంకేమీ చేత కాద‌ని ఎద్దేవా చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi). మ‌రోసారి త‌మ పార్టీని ఆశీర్వ‌దించాల‌ని, ఈ సారి క‌ర్ణాట‌క‌ను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా త‌యారు చేస్తాన‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. తాము దేశాన్ని అన్ని రంగాల‌లో అభివృద్ది కోసం ప్ర‌య‌త్నం చేస్తుంటే దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు ఇవాళ జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో. ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌ళ్లున్న క‌బోధి అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : మోదీపై అర‌వింద్ కేజ్రీవాల్ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!