Qin Gang : కలుద్దాం ముందుకు సాగుదాం – గ్యాంగ్
ఎస్ జై శంకర్ తో చైనా విదేశాంగ మంత్రి
Qin Gang : చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్(Qin Gang) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, భారత దేశాల మధ్య సత్ సంబంధాలు మరింత బలవంతం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గోవా వేదికగా జరిగిన జి20, ఎస్ సి వో సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి గ్యాంగ్ తో పాటు నిత్యం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో భేటీ అయ్యారు క్విన్ గ్యాంగ్. కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
క్విన్ గ్యాంగ్ మాట్లాడుతూ భారత్, చైనా దేశాలు అత్యంత కీలకమైనవి. మనం ఒకరినొకరం గౌరవించు కోవాలి. పరస్పరం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇరు పక్షాలు అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు క్విన్ గ్యాంగ్.
భారత్ , చైనా సరిహద్దులో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందన్నారు. సుస్థిర శాంతి, ప్రశాంతత కోసం పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు క్విన్ గ్యాంగ్(Qin Gang). ప్రస్తుత విజయాలను ఏకీకృతం చేయాలని, సంబంధిత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మంత్రులు కీలక అంశాలపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు ఫలప్రదం కావాలని క్విన్ గ్యాంగ్ , సుబ్రమణ్యం జై శంకర్ కోరుకున్నారు.
Also Read : బిలావల్ భుట్టో ఎస్ జై శంకర్ భేటీ