Smriti Irani : కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) నిప్పులు చెరిగారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 10న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు రానున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తారా స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
శుక్రవారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెబుతోందన్నారు. పవర్ లోకి రావాలని కలలు కంటోందన్నారు. కానీ ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు స్మృతీ ఇరానీ. ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు .
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న హనుమాన్ ఆలయాలను అభివృద్ది చేస్తామని, అంతే కాకుండా పవర్ లోకి వస్తే కొత్తి వాటిని కూడా నిర్మిస్తామన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇచ్చిన హామీపై భగ్గుమన్నారు స్మృతీ ఇరానీ(Smriti Irani) .
ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం, ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తాము కర్ణాటకలో పాలన సాగిస్తున్నామని ప్రజలు తమ వైపు ఉన్నారని జోస్యం చెప్పారు.
Also Read : ప్యాడ్స్ ధరించండి శుభ్రత పాటించండి
