Piyush Chawla Record : వికెట్ల వేటలో చావ్లా రారాజు
34 ఏళ్లు 174 వికెట్లు
Piyush Chawla Record : ఐపీఎల్ లో అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు పీయూష్ చావ్లా(Piyush Chawla Record). క్రికెట్ లో 30 ఏళ్లు వచ్చాయంటే ఇక రిటైర్ కావాల్సిందే. గతంలో వయసు మీద పడినా ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు పోటీ అధికమైంది. యువ ఆటగాళ్లు పోటీకి వస్తున్నారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు.
ఇంకొందరు వయసు మీద పడినా రాణిస్తున్నారు. వారిలో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పీయూష్ చావ్లా. అతడి వయసు 34 ఏళ్లు. కానీ యువ బౌలర్లతో పోటీ పడుతున్నాడు. ప్రత్యర్థి జట్లకు తన బౌలింగ్ యాక్షన్ తో చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ లో సత్తా చాటాడు. వికెట్లు కూల్చుతూ ముంబై ఇండియన్స్ కు కీలకమైన బౌలర్ గా మారాడు. ఇప్పటి దాకా 17 వికెట్లు తీశాడు. అత్యుత్తమైన బౌలర్ రేసులో టాప్ లో నిలిచాడు.
అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 174 వికెట్లు తీశాడు. వయసు పెరిగే కొద్దీ పటుత్వం తగ్గుతుంది. విపరీతమైన ఒత్తిడి, యువ ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ. కానీ ప్రతిభకు ఇవేవీ అడ్డంకి కాదని నిరూపించాడు పీయూష్ చావ్లా(Piyush Chawla Record).
కాగా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేరుతో ఉంంది. 183 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 179 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో ప్లేస్ కు చేరుకున్నాడు పీయూష్ చావ్లా.
Also Read : రాజస్థాన్ హైదరాబాద్ నువ్వా నేనా