Brij Bhushan Sharan Singh : రుజువు చేస్తే ఉరి వేసుకుంటా
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కామెంట్స్
Brij Bhushan Sharan Singh : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు రైతులు మద్దతు ప్రకటించారు. వారి సమస్య పరిష్కారం అయ్యేంత దాకా పోరాడుతామని ప్రకటించారు. ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ఈ సందర్బంగా రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) ఆదివారం స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశారు. తనపై మహిళా మల్లయోధులు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.
దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా అడిగితే తాను తప్పుకుంటానని అప్పటి దాకా వైదొలిగే ప్రసక్తి లేదని పేర్కొన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.
వాళ్లు చేసిన ఆరోపణలలో ఒక్క ఆరోపణకు సంబంధించి రుజువు చేసినా తాను ఉరి వేసుకుంటానని స్పష్టం చేశారు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారని, తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం మంచిది కాదన్నారు.
తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను సమర్పించ లేక పోయారని ఆరోపించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh).
Also Read : మోదీ మెగా రోడ్ షో అదుర్స్