TDP Mahanadu : అభ్యర్థుల జాబితాపై బాబు ఫోకస్
మహానాడులో కనీసం 50 మంది ఎంపిక
TDP Mahanadu : ఏపీలో రాజకీయాలు వేడిని రాజేస్తున్న తరుణంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా మహానాడు నిర్వహించనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థులు కూడా ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మే 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు రాజమహేంద్ర వరంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ(TDP Mahanadu) హై కమాండ్ నిర్ణయించింది. తొలి రోజు ప్రతినిధుల సభ , కొన్ని పత్రాల ప్రవేశానికి కేటాయించగా రెండో రోజు ఆమోదం పొందనుంది. చివరలో బహిరంగ సభ నిర్వహిస్తారు.
పార్టీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ సందర్భాన్ని ఉపయోగించు కోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ జాబితాలో 50 మంది పేర్లు ఉంటాయని అంచనా. ఇటీవల చంద్రబాబు, లోకేష్ కొందరి పేర్లను ప్రకటించారు. తండ్రి ఓ వైపు పర్యటిస్తుండగా మరో వైపు యువ గళం పేరుతో లోకేష్ టూర్ లో బిజీగా ఉన్నారు.
త్వరలో జరిగే మహానాడులో పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారా లేక వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి. ఇక వైఎస్సార్ సీపీ సర్కార్ ఇప్పటికే సిట్టింగ్ లకు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కూడా టీడీపీ బరిలోకి దిగనుంది.
Also Read : లిక్కర్ స్కాంలో 2 వేల కోట్ల అవినీతి