Ganta Srinivasa Rao : ‘స్పందన’ శూన్యం ఎవరికి ఉపయోగం
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
Ganta Srinivasa Rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. మంగళవారం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమానికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లుగా స్పందనకు కాళ్లు అరిగేలా తిరిగినా ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. పాలన గాడి తప్పిందని , దాని వల్ల సమస్యలు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao).
తమ పొలాలు రాజధాని కోసం ఇచ్చి దగా పడిన అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా అని నిలదీశారు . జీతం ఎప్పుడు పడుతుందో తెలియని స్థితిలో ఉద్యోగులు ఉన్నారని, కరవుతో అల్లాడుతున్న రైతులను ఆదుకుంటారా అని ప్రశ్నించారు. ఇవన్నీ మీకు తెలియడం లేదా లేక కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు గంటా శ్రీనివాసరావు.
పెన్షన్ రాక రిటైర్డు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డెక్కారని వారి గురించి ఆలోచిస్తారా అని పేర్కొన్నారు. పవర్ లోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పారని కానీ ఇవాళ అదే ఆదాయ వనరుగా మార్చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు గంటా శ్రీనివాసరావు.
Also Read : రైతులను ఆదుకోని జగన్ దిగి పోవాలి