KTR UK Tour : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం యునైటెడ్ కింగ్ డమ్(KTR UK Tour) పర్యటన నిమిత్తం బయలు దేరి వెళ్లారు. ఆయన మే 13వ తేదీ వరకు అక్కడ పర్యటిస్తారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ సంస్థలుతో పాటు , వ్యాపార వాణిజ్య సంఘాలతో సమావేశం అవుతారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు , కార్యక్రమాల గురించి వివరిస్తారు.
ఇవాళ దేశంలోనే ఐటీ పరంగా తెలంగాణ టాప్ లో కొనసాగుతోంది. అంతే కాకుండా ఫార్మా, లాజిస్టిక్ రంగాలలో సైతం ముందంజలో ఉంది. కరోనా నివారణకు సంబంధించి వ్యాక్సిన్ల తయారీలో సైతం హైదరాబాద్ నుంచే తయారవుతోంది.
ఇక లాజిస్టిక్ పరంగా టాప్ లో ఉంది తెలంగాణ. ప్రపంచంలోని టాప్ కంపెనీలకు చెందిన డేటా సెంటర్లు హైదరాబాద్ లో కొలువు తీరాయి. ఇక అమెజాన్ , గూగుల్ , మైక్రో సాఫ్ట్ , ఒరాకిల్ , ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ ఐటీ దిగ్గజాలన్నీ భాగ్యనగరంలో ఉన్నాయి.
ప్రభుత్వం అత్యుత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకు వచ్చింది. పెట్టుబడిదారులకు , వ్యాపారవేత్తలకు ఎర్ర తివాచీ పరుస్తోంది. 15 రోజుల్లోనే దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇచ్చే సౌలభ్యాన్ని తీసుకు వచ్చింది. ఇక ఇన్నోవేషన్స్ , స్టార్టప్ లకు కొదవే లేకుండా పోయింది. వీటన్నింటి గురించి వివరించనున్నారు కేటీఆర్.
Also Read : 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల