Seerat Kapoor Bunny : బన్నీతో నటించడం అబద్దం
వివరణ ఇచ్చిన సీరత్ కపూర్
Seerat Kapoor Bunny : బాలీవుడ్ నటి సీరత్ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అల్లు అర్జున్ తో కలిసి పుష్ప-2 లో నటిస్తున్నానని, స్పెషల్ సాంగ్ లో కనిపించ బోతున్నానంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని తెలిపింది. తాను బన్నీ ఇద్దరం మంచి మిత్రులమని పేర్కొంది. తన వ్యక్తిగత ఇన్ స్టా గ్రామ్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేసింది. తాను పుష్ప-2 చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులు , పుకార్లను ఎవరు వ్యాపింప చేస్తున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ వాపోయింది.
ఇదిలా ఉండగా బన్నీ , నేషనల్ క్రష్ కలిసి నటించిన పుష్ప -1 మూవీ దుమ్ము రేపింది. దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఊ అంటావా అన్న పాట టాప్ లో నిలించింది. ఈ పాటను ప్రముఖ నటి సమంత రుతు ప్రభు నటించింది. ఈ ఒక్క పాటకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఈ చిత్రం.
పుష్ప -1 బిగ్ హిట్ కావడంతో చిత్ర దర్శకుడు సుకుమార్ పుష్ప -2 ప్రకటించాడు. ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేశాడు. దీనికి భారీ ఎత్తున స్పందన వచ్చింది. అయితే ఈ తాజా చిత్రంలో ఐటం సాంగ్ లో సీరత్ కపూర్ నటిస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తంగా ఈ రకంగానైనా సీరత్ కు మంచి ప్రచారం దక్కింది.
Also Read : మత రాజకీయాలు ప్రమాదం – ప్రకాశ్ రాజ్