#WilliamCoolidge : సాగే టంగ్స్టన్ ఆవిష్కర్త విలియం డి.కూలిడ్జ్ వర్ధంతి
Death day of William D. Coolidge, inventor of elastic tungsten
William D Coolidge : విలియం డి.కూలిడ్జ్ ( అక్టోబరు 23 1873 – ఫిబ్రవరి 3 1975 అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. సాగే గుణం కలిగిన టంగ్స్టన్ ఆవిష్కర్త. ఆయన X-కిరణం యంత్రాలపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ లాబొరేటరీకి డైరక్టర్ గా పనిచేశారు, కార్పొరేషన్ కు ఉపాధ్యక్షునిగా కూడా ఉన్నారు. ఆయన “సాగేగుణం గల టంగ్స్టన్”ను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి పొందారు. ఈ టంగ్స్టన్ విద్యుత్ బల్బులలో ముఖమైన భాగం.
కూలిడ్జ్(William D Coolidge) మసాచుసెట్ట్స్ యందలి హడ్సన్ సమీపంలోని ప్రదేశంలో జన్మించారు. ఆయన 1891 నుండి 1896 లో మసాచుసెట్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో చేరే వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. లాబొరేటరీ అసిస్టెంట్ గా పనిచేసిన సంవత్సరం తరువాత ఆయన జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లారు. అక్కడ డాక్టరేట్లను పొందారు. ఆయన 1899 నుండి 1905 వరకు ఎం.ఐ.టి వద్ద రసాయన శాస్త్ర విభాగంలో గల ఆర్థర్ ఎ నోయ్స్ వద్ద రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేశారు.
కూలిడ్జ్(William D Coolidge) 1905 లో కొత్త పరిశోధనా ప్రయోగ శాలలో జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ వద్ద పరిశోధకునిగా పని చేయుటకు వెళ్లారు. అక్కడ ఆయన అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన పరిశోధన విద్యుత్ బల్బులలో ఫిలమెంటుగా ఉపయోగించే లోహంగా “టంగ్స్టన్” ఉపయోగించుటకు దోహద పడింది. ఆయన టంగ్స్టన్ లో సాగేగుణం గలదానిని అభివృద్ధి చేసారు. ఈ పరిశోధన ఫలితంగా విద్యుత్ బల్బులోని ఫిలమెంటును సులువుగా తీగలుగా మలచవచ్చు. దానిని టంగ్స్టన్ ఆక్సైడు ద్వారా శుద్ధి చేయవచ్చు. 1911 మొదట్లో “జనరల్ ఎలక్ట్రిక్” ఈ క్రొత్త రకం ఫిలమెంట్ తో బల్బులను మార్కెట్ లో విడుదల చేసింది. దీని ఫలితంగా ఆ సంస్థకు ముఖమైన ఆదాయ వనరుగా ఈ బల్బుల అమ్మకం దోహద పడింది. ఆయన 1913 లో ఆయన క్రొత్త ఆవిష్కరణకు పేటెంట్ (US#1,082,933) కొరకు దరఖాస్తు చేసి పొందారు. అదే విధంగా 1928 లో యు.ఎస్. లోని కోర్టు తాను తయారుచేసిన 1913 లోని పేటెంట్ విలువైన ఆవిష్కరణగా గుర్తించింది.
X-కిరణ నాళం అభివృద్ధి
1913 లో ఆయన కూలిడ్జ్ నాళాన్ని ఆవిష్కరణ చేసారు. అభివృద్ధి చెందిన కాథోడుతో కూడిన X-కిరణ నాళం అనేక ఎక్స్ – కిరణ యంత్రాలలో ఉపయోగించడం వలన శరీరంలో చాలా అంతర భాగాలలో ఉన్న కాన్సర్ కణతులను కూడా కచ్చితంగా గుర్తించుటకు తోడ్పడింది. ఈ కూలిడ్జ్ నాళంలో టంగ్స్టన్ను ఫిలమెంట్ గా ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించుట వైద్యరంగం లోని రేడియాలజీ విభాగంలో ప్రముఖ అభివృద్ధికి దోహద పడింది. ఈ నాళం సంబంధిత ప్రాథమిక డిసైన్ ను ప్రస్తుతం కూడా ఉపయోగిస్తున్నారు. ఆయన మొట్ట మొదటి భ్రమణం చేసే ఆనోడు X-కిరణ నాళాన్ని ఆవిష్కరణ చేశారు. ఆయన 1913 లో యు.ఎస్. పేటెంట్ కోసం దరఖాస్తు చేసి 1916 లో పొందారు.
1914 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆయనను రమ్ఫోర్డ్ ప్రైజ్ తో సత్కరించింది.
1927 లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎడిసన్ మెడల్ ను పొందారు. ఈ మెడల్ ఆయన ప్రకాశించే విద్యుత్ కాంతి, X-కిరణాలు కళ సేవల” కు పొందారు.
1926 లో హోవార్డ్ ఎన్. పోట్స్ మెడల్, 1927 లో లూయీస్ ఇ.లెవీ మెడల్1939 లో ఫారడే మెడల్, 1944 లో ఫ్రాంక్లిన్ మెడల్ ,
1975 లో నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక కాబడినారు. ఈ ఎంపిక ఆయన తన 101 వ సంవత్సరంలో మరణించుటకు కొన్ని రోజుల ముందుగా న్యూయార్క్ లోని షెనెక్టడీలో పొందారు.
No comment allowed please