3rd Explosion Punjab : స్వ‌ర్ణ దేవాల‌యం వ‌ద్ద పేలుడు

వారంలో ఇది మూడోసారి కావ‌డం విశేషం

పంజాబ్ లోని అమృత్ స‌ర్ లోని స్వ‌ర్ణ దేవాయ‌లం (గోల్డెన్ టెంపుల్ )లో గురువారం తెల్ల వారుజామున 1 గంట‌కు పేలుడు సంభ‌వించింది. వారం రోజుల్లో ఇది మూడో పేలుడు సంభ‌వించ‌డం విశేషం. హెరిటేజ్ స్ట్రీట్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న నెల‌కొంది. పంజాబ్ ఆప్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించారు. ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. వారిని విచారిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇదిలా ఉండ‌గా స్వ‌ర్ణ దేవాల‌యం స‌మీపంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు మూడు చోటు చేసుకున్నాయి. ఈ పేలుడు ఘ‌ట‌న‌లు ఐదు రోజుల్లో చోటు చేసుకోవ‌డం పై ఫోక‌స్ పెట్టింది పోలీస్. మొద‌టి పేలుడు మే 6న జ‌రిగింది. రెండవ పేలుడు మే 8న చోటు చేసుకుంది. మూడవ పేలుడు గురువారం చోటు చేసుకుంది. ఇవాళ సంభ‌వించిన పేలుడు త‌క్కువ తీవ్ర‌త క‌లిగినంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఒక వేళ భారీ పేలుడు సంభ‌వించి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం జ‌రిగి ఉండేద‌ని పేర్కొన్నారు.

కాగా ప్ర‌సిద్ద ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా గుర్తింపు పొందింది స్వ‌ర్ణ దేవాల‌యం స‌మీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ నుండి దాదాపు 2 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) , పంజాబ్ పోలీసులు పేలుడు జ‌రిగిన ప్ర‌దేశం నుండి ఫోరెన్సిక్ న‌మూనాల‌ను సేక‌రించాయి. ఘ‌ట‌నపై విచార‌ణ జ‌రుపుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!