Pawan Kalyan : రైతుల‌ను వేధిస్తే ఊరుకోను – ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీ స‌ర్కార్ కు జ‌న‌సేన చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు కోల్పోయిన రైతుల‌ను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు. వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు. అన్నం పెట్టే అన్న‌దాత‌లను ఆదుకోవాల్సిన బాధ్య‌త సీఎం జ‌గ‌న్ రెడ్డిపై ఉంద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .
గురువారం రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అకాల వ‌ర్షాల తాకిడికి పంట పొలాలు దెబ్బ‌తిన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాన్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా బాధిత రైతులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌మ గోడు వెళ్ల బోసుకున్నారు. వారికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెంట‌నే పంట‌లు న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని, న‌ష్ట ప‌రిహ‌రం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు పవ‌న్ క‌ళ్యాణ్.

ఈ సంద‌ర్భంగా నిప్పులు చెరిగారు రాష్ట్ర ప్ర‌భుత్వంపై. త‌నతో పంట న‌ష్టం గురించి త‌మ గోడు వెళ్ల బోసుకున్న రైతుల‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు , ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు వేధింపుల‌కు గురి చేస్తే ఊరుకోన‌ని నిప్పులు చెరిగారు. అకాల వ‌ర్షానికి త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని, దీనికి సీఎం బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌.

అంత‌కు ముందు జ‌న‌సేన పార్టీ ప్రాంతీయ కార్యాల‌యాన్ని రాజ‌మండ్రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించారు. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న సైనికులు స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!