ఆంధ్రాకు చెందిన ప్రముఖ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాయుడు గురువారం ప్రత్యేకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసినా దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న ప్రచారం గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. క్రికెటర్ రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆపై మాజీ భారత క్రికెట్ జట్టు స్కిప్పర్ మహమ్మద్ అజారుద్దీన్ పై నోరు పారేసుకున్నారు.
ఆ తర్వాత తాను ఆట నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశాడు. చివరకు తాను చెప్పిన మాటకు కట్టుబడలేదు. తిరిగి క్రికెట్ ఆడతానంటూ ప్రకటించాడు. ఆ తర్వాత హైదరాబాద్ కు కాకుండా ప్రస్తుతం ఆంధ్రాపై ఫోకస్ పెట్టాడు అంబటి రాయుడు.
ఇదే సమయంలో తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఇదే క్రమంలో ఇవాళ ప్రత్యేకంగా అంబటి రాయుడు తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎంను కలుసు కోవడం కలకలం రేపింది. ఆయన కచ్చితంగా వైసీపీలో చేరేందుకు
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు గతంలో తన మనసులో మాట బయట పెట్టాడు. ఇదే సమయంలో అతడిని బీఆర్ఎస్ లో చేర్చుకోవాలని ఆ పార్టీ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ అది వర్కవుట్ కాలేదు. చివరకు జగన్ వైపు అంబటి కన్నేశాడు.
