ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడ్పాటుతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రీ అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ యాగం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. శుక్రవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆచార్యులు, పూజారులు, వేద పండితులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏపీ సీఎంను ఆశీర్వదించారు. ఆయనకు మంగళా శాసనాలు అందజేశారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని , ప్రజలంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుతూ ఏపీ సీఎం కోరిక మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. ఈ యాగంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగుతుంది .
ఇందులో భాగంగా అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ యాగం, రుద్ర యాగం, రాజ శ్యామల యాగం, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ యాగం నిర్వహించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికారు వేద పండితులు. అనంతరం గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఏపీ సీఎం . కపిల గోవుకు హారతి ఇచ్చారు. అఖండ దీపారాధనలో పాల్గొన్నాడు.
