ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్న ట్విట్టర్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ దానిని టేకోవర్ చేసుకోవడంతో అంతా విస్తు పోయారు. రూ. 4,400 కోట్లకు పైగా భారీ ధరకు కొనుగోలు చేశాక ఉన్నట్టుండి షేర్స్ ఒడిదుడులకు లోనైంది. అయినా మనోడు గట్టోడు కావడంతో అన్నింటిని తట్టుకుని నిలబడ్డాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. మొట్ట మొదటిసారిగా ట్విట్టర్ లోకి అడుగు పెట్టాడు. ఆపై టాప్ లెవల్లో ఉన్న వారిని తీసేశాడు.
12 వేల మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కు చెక్ పెట్టాడు. అంతే కాదు వసతి సౌకర్యాలు ఉండబోవంటూ ప్రకటించాడు. దీంతో ఎలాన్ మస్క్ కు పిచ్చి పట్టిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ వాటిని పట్టించు కోలేదు. రోజు రోజుకు ట్విట్టర్ ను గాడిలో పెట్టే పనిలో పడ్డాడు. కీలక మార్పులు, సంస్కరణలు తీసుకు వచ్చాడు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. అదేమిటంటే యూజర్లకు తీపి కబురు చెప్పాడు. ట్విట్టర్ ద్వారా మెస్సేజ్ లే కాదు కాల్స్ కూడా చేసుకోవచ్చంటూ ప్రకటించాడు. దీంతో ట్విట్టర్ షేర్స్ అమాంతం పెరిగాయి. ఇక మరో షాకింగ్ న్యూస్ చెప్పాడు.
అదేమిటంటే త్వరలోనే ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఎవరు సిఇఓ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
