కేంద్రంలో కొలువు తీరిన మోదీ పరివారం ఏ మాత్రం వీలు చిక్కినా ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఈ దేశంలో ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరించింది భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గనుక అధికారంలోకి వస్తే బీజేపీకి చెందిన బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
దీనిపై దేశ వ్యాప్తంగా బీజేపీ నిరనస వ్యక్తం చేసింది. ఆపై నిప్పులు చెరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాత్రం తాను అన్నదాంట్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిని ప్రధాన అస్త్రంగా మల్చుకుంది బీజేపీ కర్నాటకలో . అంతే కాదు కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు రేపాలని ప్రయత్నం చేసింది.
అవేవీ వర్కవుట్ కాలేదు. కర్ణాటక ప్రజలు ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. 224 సీట్లకు గాను 136 సీట్లు కట్టబెట్టారు. అయితే ఏఐసీసీ చీఫ్ ఖర్గేపై ఏకంగా రూ.100 కోట్లు చెల్లించాలని పరువు నష్టం కేసు దాఖలైంది. హిందూ సురక్షా పరిషద్ భజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్ ఈ కేసు వేశారు.