కర్ణాటక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సీఎం ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పిటకే సీఎల్పీ సమావేశం ముగిసింది. ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేస్తే వారికే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి పార్టీ మాజీ సీఎం షిండే సారథ్యంలో అభిప్రాయాలను సేకరించింది.
పూర్తి నివేదికను ఏఐసీసీకి సమర్పించింది. ప్రస్తుతం బంతి ఢిల్లీకి చేరింది. ఎవరు ఎన్నికవుతారనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విశ్వసీయ సమాచారం మేరకు డీకే వైపు పార్టీ మొగ్గు చూపినట్లు సమాచారం.
పార్టీ కర్ణాటక చీఫ్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి దాకా డీకే శివకుమార్ అహోరాత్రులు కష్టపడ్డాడు. కొందరిని తన వారిని పోగొట్టుకున్నాడు. తన వారికి టికెట్ రాక పోయినా మిన్నకుండి పోయారు. కానీ తాను ఎంపిక చేసిన అభ్యర్థులలో చాలా మందిని తానే బరిలో నిల్చునేలా చేశాడు. దాదాపు 24 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకుంది. ఏకైక పార్టీగా అవతరించింది. ఏ ఒక్క పార్టీపై ఆధార పడకుండానే పవర్ లోకి రానుంది.
ఈ తరుణంలో మాజీ సీఎం సిద్దరామయ్య సైతం పోటీ పడ్డారు. ఇద్దరూ నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కూడా నడిచింది. ఎన్నికల్లో ఒక్కటేనని ప్రకటించినా చివరకు మెజారిటీ రావడంతో సీఎం పోస్టుకు పోటీ పడ్డారు. చివరకు హైకమాండ్ డీకే వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
