Google CEO Sundar Pichai key comments on AI : కృత్రిమ మేధస్సుపై పిచాయ్ కామెంట్స్
కంప్యూటర్లు మనుషులకు ఇక సేవకులు
Google CEO Sundar Pichai key comments on AI : యావత్ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) గురించి చర్చ జరుగుతోంది. ఏఐ అనేది ఎంత మేరకు ఉపయోగ పడుతుందో అనే దానిపై దిగ్గజ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తన స్వంత బింగ్ సెర్చింగ్ ఇంజన్ కు యాడ్ చేసింది. దీంతో క్షణాల్లోపే సమస్త సమాచారం అందుబాటులోకి వస్తోంది. ఇక ఇప్పటి దాకా టెక్నాలజీ పరంగా టాప్ లో కొనసాగుతూ వస్తున్న గూగుల్ కు బిగ్ ఛాలెంజ్ గా మారింది ఈ ఏఐ.
ఈ ఒక్కటి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చివరకు అందరినీ శాసిస్తూ వస్తున్న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్, మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ ఏఐ వల్ల మానవ వనరులకు ప్రమాదం పొంచి ఉందన్న భయాందోళనలు అంతటా నెలకొన్నాయి. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేందుకు బైడెన్ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా గూగుల్ సీఇఓ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ కంప్యూటర్లను మనుషులకు నిజమైన సేవకులుగా మారుస్తుందని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం గూగుల్ సిఇఓ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏఐ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, మానవ వనరులకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండబోదన్నారు. కానీ గూగుల్ లో ఇటీవల భారీ ఎత్తున జాబర్స్ ను తొలగించారు.
Also Read : CBI Raids