DK Shiva Kumar : డిప్యూటీ సీఎం పోస్ట్ డోంట్ కేర్ – డీకే
సిద్దరామయ్య ఏం చేశారో చెప్పాలి
DK Shiva Kumar : కర్ణాటక సీఎం పోస్టు ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేబినెట్ లో కీలక పోస్టులతో పాటు డిప్యూటీ సీఎం పదవి డీకే శివకుమార్ కు ఏఐసీసీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కేపీసీసీ చీఫ్ ప్రత్యేకంగా సిద్దరామయ్య పై కీలక వ్యాఖ్యలు చేసినట్లు టాక్. ఇంత కాలం కర్ణాటకకు సిద్దరామయ్య ఏం చేశారో చెప్పాలని కోరారు. ఆయన ఇదే విషయాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో ప్రస్తావించారు.
ఉప ముఖ్యమంత్రి పదవిని తాను స్వీకరించేందుకు సిద్దంగా లేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు తెలిపారు డీకే శివకుమార్. తాను పదవి లేకుండా ఉండగలనని పేర్కొన్నారు. ఈ కీలక మీటింగ్ కంటే ముందు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తో ఆరు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ ఇచ్చింది ఏఐసీసీ.
ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం మరోసారి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. సీఎం పై ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే సీఎంగా రాహుల్ గాంధీ సిద్దరామయ్య వైపు మొగ్గు చూపినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రణ్ దీప్ సూర్జేవాలా.
Also Read : Google CEO Sundar Pichai key comments on AI