Sameer Wankhede : కోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడే
ఆర్యన్ ఖాన్ కేసులో సీబీఐ సమన్లు
Sameer Wankhede : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే(Sameer Wankhede) కోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ బాద్ షా తనయుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ నుంచి తప్పించేందుకు రూ. 25 కోట్లు లంచంగా డిమాండ్ చేశాడని ప్రధాన అభియోగం మోపింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఈ మేరకు సమీర్ వాంఖడే కు నోటీసులు జారీ చేసింది.
ఎన్సీబీ ఫిర్యాదుపై అవినీతి నిరోధక చట్టం కింద లంచానికి సంబంధించిన రూల్స్ తో పాటు నేరపూరిత కుట్ర, దోపిడీ బెదిరింపు ఆరోపణలపై మాజీ ఆఫీసర్ సమీర్ వాంఖడే తోపాటు ఇతరులపై సీబీఐ అభియోగాలు మోపింది.
ఆర్యన్ ఖాన్ ను ఇరికించకుండా ఉండాలంటే తమకు రూ. 25 కోట్లు ఇవ్వాలని సమీర్ వాంఖడే నిందితుల ద్వారా డిమాండ్ చేయించాడని ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉండగా సీబీఐ కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు సమీర్ వాంఖడే. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వేసిన పిటిషన్ లో సమీర్ వాంఖడే తనపై సీబీఐ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని పిటిషన్ లో కోరాడు సమీర్ వాంఖడే.
Also Read : DK Shiva Kumar