AP CM YS Jagan : వాలంటీర్ల సేవ‌ల‌కు వంద‌నం – జ‌గ‌న్

వాళ్లు లేక పోతే ప్ర‌భుత్వం లేదు

AP CM YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వాలంటీర్ల సేవ‌ల‌ను కొనియాడారు. వాళ్లు లేక పోతే ప్ర‌భుత్వం లేద‌న్నారు. ఇవాళ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ఎప్ప‌టికప్పుడు చేర‌వేసేలా చేస్తున్నార‌ని సీఎం ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వానికి వెన్ను ద‌న్నుగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

కొంద‌రు ప‌ని గ‌ట్టుకుని వాలంటీర్ల‌పై లేనిపోని అభాండాలు వేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ రెడ్డి. కానీ తాను మాత్రం వాలంటీర్లు ప్ర‌భుత్వంలో అంత‌ర్భాగమ‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్నారు సీఎం.

వాళ్లు వాలంటీర్లు మాత్ర‌మే కాద‌ని ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లు అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విజ‌య‌వాడ‌లో వ‌లంటీర్ల‌కు వంద‌నం కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ రెడ్డి మాట్లాడారు. ఇవాళ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ బ‌లంగా మారింద‌ని చెప్పారు.

ఒక మ‌హా సైన్యంగా మార‌డం త‌న‌కు సంతోషం క‌లిగిస్తోంద‌ని చెప్పారు. రాష్ట్రంలోని 64 ల‌క్ష‌ల మందికి ఒక‌టో తేదీన‌నే పెన్ష‌న్ అందిస్తున్నామంటే కేవ‌లంల వాలంటీల‌ర్ల వ‌ల్ల‌నే జ‌రుగుతుంద‌న్నారు

Also Read : Sudha Murthy Troll

 

Leave A Reply

Your Email Id will not be published!