Arvind Kejriwal : సుప్రీం ఆదేశాలు ఎల్జీ బేఖాతర్ – సీఎం
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై విరుచుకు పడ్డారు. ఇప్పటికే కేంద్రం, ఢిల్లీ మధ్య చోటు చేసుకున్న వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎల్జీకి అధికారాలు నామమాత్రంగానే ఉంటాయని స్పష్టం చేసింది. కేవలం శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు మాత్రమేనని మిగతావన్నీ ఢిల్లీ సర్కార్ కు చెందుతాయని స్పష్టం చేసింది.
తాజాగా తాము పంపించిన ఫైళ్లపై సంతకాలు పెట్టకుండా ఎల్జీ సక్సేనా నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా కామెంట్స్ చేసిందని, స్పష్టమైన తీర్పు చెప్పిందని అయినా ఎస్సీ ఆదేశాలు ఎందుకు పాటించడం లేదంటూ నిలదీశారు కేజ్రీవాల్.
ఇది మంచి పద్దతి కాదన్నారు . గత రెండు రోజులుగా సర్వీసెస్ సెక్రటరీ ఫైలుపై కావాలని సంతకం చేయకుండా నిలిపి వేశారంటూ ఆరోపించారు. వచ్చే వారం ఆర్డినెన్స్ తీసుకు రావడం ద్వారా కేంద్రం అడ్డుకోవాలని చూస్తోందా అన్న అనుమనం తలెత్తుతోందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో రెండు కీలక తీర్పులు వెలువరించింది సుప్రీంకోర్టు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మహా ఘట్ బంధన్ సర్కార్ ను కూల్చడంలో పరోక్షంగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఆనాటి స్పీకర్ తోడ్పాటు అందించారంటూ మండిపడింది. లక్ష్మణ రేఖ దాటితే ఎలా అని ప్రశ్నించింది ధర్మాసనం. ఇదే సమయంలో కేంద్రానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఢిల్లీపై కేంద్రం పెత్తనం చెల్లదని తీర్పు చెప్పింది.
Also Read : V Srinivas Goud