Nara Lokesh : ఏపీలో గాడి తప్పిన పాలన
టీడీపీ నేత నారా లోకేష్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా ఏపీ సర్కార్ ను, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. యువ గళం పేరుతో ప్రజల మధ్యకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఇవాళ్టితో 107వ రోజుకు చేరుకుంది.
యాత్ర సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను వింటున్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చాలా వాటిని పక్కన పెట్టారంటూ ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మెరుగైన పాలన అందించే సత్తా ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారను నారా లోకేష్.
ఈ సందర్బంగా ఆముదాల మిట్ట క్యాంప్ సైట్ లో గ్రానైట్ పరిశ్రమదారులు, కార్మికులతో ముఖాముఖి సమావేశం అయ్యారు. వారు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విన్నవించారు. త్వరలోనే తమ ప్రభుత్వం వస్తుందని , సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు నారా లోకేష్. ఏపీలో పాలన గాడి తప్పిందని , ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కొలువు తీరిన జగన్ రెడ్డి ఎన్ని కంపెనీలను ఏపీకి తీసుకు వచ్చాడో చెప్పాలన్నారు. అన్ని వర్గాలకు చెందిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Vijay Shankar