Lalan Singh : విప‌క్షాల ఐక్య‌త‌పై ఫోక‌స్

జేడీయూ చీఫ్ లాల‌న్ సింగ్

Lalan Singh : జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీ చీఫ్ లాల‌న్ సింగ్(Lalan Singh) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విపక్షాల ఐక్యత‌కు సంబంధించి ఒక‌టి రెండు రోజుల్లో స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని వెల్ల‌డించారు. ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

ఇవాళ జేడీయూ చీఫ్ ప్ర‌త్యేకించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌లతో స‌మావేశం అయ్యారు . ఈ ములాఖ‌త్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త్వ‌ర‌లో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని ప‌క్షాలు ఒకే వేదిక‌పైకి రావాల‌ని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో మొద‌ట‌గా అడుగు వేశారు జేడీయూ అగ్ర నేత‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఇప్ప‌టికే ఆయ‌న సీఎంలు మ‌మ‌తా బెన‌ర్జీ, నవీన్ ప‌ట్నాయ‌క్, అర‌వింద్ కేజ్రీవాల్ తో చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ తో భేటీ అయ్యారు. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం కూలి పోయింది.

224 సీట్ల‌కు గాను 136 సీట్ల‌తో కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. దీనిపై కీల‌క కామెంట్స్ చేశారు సీఎం నితీశ్ కుమార్. ఈ మార్పు దేశ వ్యాప్తంగా ప్ర‌తిఫ‌లించ‌డం ఖాయ‌మ‌న్నారు. ప్ర‌స్తుతం విప‌క్షాల‌ను ఏకం చేయ‌డంలో భాగంగా పార్టీ చీఫ్ లాల‌న్ సింగ్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

Also Read : Congress Support AAP

 

Leave A Reply

Your Email Id will not be published!