Meta Lay Offs : మెటాలో టాప్ ఎగ్జిక్యూటివ్స్ కు షాక్

వేలాది మంది ఉద్యోగులకు మంగ‌ళం

Meta Lay Offs : ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ముఖ పుస్త‌కం మాతృ సంస్థ మెటా లో భారీ ఎత్తున ఉద్యోగుల‌ను తొల‌గించారు(Meta Lay Offs). ఇప్ప‌టికే టెక్ దిగ్గ‌జ కంపెనీలు కొలువుల‌కు మంగళం పాడుతున్నాయి. భార‌త దేశంలోని టాప్ ఎగ్జిక్యూటివ్ లకు కోలుకోలేని షాక్ త‌గిలింది. టాప్ జాబ్స్ కోల్పోయిన వారిలో మార్కెట్ ఇండియాలో ఇద్ద‌రు ఉన్నారు. వారిలో మార్కెటింగ్ డైరెక్ట‌ర్ అవినాష్ పంత్ , డైరెక్ట‌ర్ ,మీడియా భాగ‌స్వామ్య చీఫ్ సాకేత్ ఝూ సౌర‌భ్ ను కూడా సాగ‌నంపింది మెటా.

ఫేస్ బుక్ య‌జ‌మాని అయిన మెటా ప్లాట్ ఫామ్స్ ఇంక్ 10, 000 మందిని తొల‌గించింది. గ‌త మార్చిలో ప్ర‌క‌టించిన ప్లాన్ లో భాగంగా మూడు విభాగాల‌లో తొల‌గింపు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు మార్క్ జుకెర్ బ‌ర్గ్. త‌న వ్యాపార‌, కార్య‌క‌లాపాల విభాగాల‌లో భారీగా త‌గ్గించింది. మార్కెటింగ్ , సైట్ సెక్యూరిటీ, ఎంట‌ర్ ప్రైజ్ ఇంజ‌నీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ , కంటెంట్ స్ట్రాట‌జీ ,కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్ లు వంటి విభాగాల‌లో ప‌ని చేస్తున్న వారిని డ‌జ‌న్ల కొద్దీ తొల‌గించింది.

ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సామాజిక సంస్థ లింక్డ్ ఇన్ లో వెల్ల‌డించింది. ముంద‌స్తు స‌మాచారం లేకుండా త‌మ‌ను తొల‌గించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు టాప్ ఎగ్జిక్యూటివ్స్. మెటా ఈ ఏడాది ప్రారంభంలో 11,000 కంటే ఎక్కువ మందిని సాగ‌నంపింది. రెండో విడ‌త‌లో మ‌రికొంత మందికి ఉద్వాస‌న ప‌లికింది.

Also Read : Brahmanandam

Leave A Reply

Your Email Id will not be published!