RS 75 Coin Introduced : రూ. 75 నాణెం విడుదలకు సిద్దం
పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా
RS 75 Coin Introduced : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా కొత్తగా ఆర్బీఐ తయారు చేసిన రూ. 75 నాణెంను విడుదల చేయనున్నారు(RS 75 Coin Introduced). నాణేనికి రెండు వైపులా పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం కలిగి ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్ , దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు రాసి ఉంచారు.
నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 సెరేషన్ ల ను కలిగి ఉంటుంది. 35 గ్రాముల నాణెం నాలుగు భాగాల మిశ్రమంతో తయారు చేశారు. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ , 5 శాతం జింక్ కలిసి ఉన్నాయి.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 25 పార్టీలు హాజరు కానుండగా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ , ఆప్ , వామపక్షాలు , టీఎంసీ , సమాజ్ వాదీ పార్టీలు మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయాలని కోరాయి.
అంతే కాదు కొత్త భవనంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశారంటూ ఆరోపించాయి. రాష్ట్రపతి కాకుండా పీఎం ఆవిష్కరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నాయి.
Also Read : Meta Lay Offs