WFI Chief : పోక్సో చట్టం దుర్వినియోగం – బ్రిజ్ భూషణ్
తనకు ఏ పాపం తెలియదన్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్
WFI Chief : భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల లైంగింక వేధింపుల చట్టం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. ఫోక్సో చట్టాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ అంశాలను పరిశీలించకుండానే తీసుకు వచ్చిందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా మహిళా రెజ్లర్లు గత ఏప్రిల్ 23 నుండి డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని , పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకు కేంద్రం స్పందించిన దాఖలాలు లేవు. తాను ఏ తప్పు చేయలేదని ,కేవలం ప్రధాని మోదీ కోరితే తప్పా తప్పుకోనంటూ ప్రకటించాడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.
ఇదిలా ఉండగా లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి రెజ్లింగ్ బాడీ చీఫ్ పై రెండు కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు నిప్పులు చెరిగారు. తమను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సీజేఐ ఆదేశాల మేరకు పోలీసులు దిగొచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెండు కేసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని , ఇందుకు సంబంధించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంపై ఎంపీ పైవిధంగా స్పందించారు.
Also Read : RS 75 Coin Introduced