Salman Butt : అతడో జీనియస్ ఆ జట్టుకే ఛాన్స్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్
Salman Butt : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్(Salman Butt) సంచలన కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెట్ రంగంలో ధోనీ అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. అంతే కాదు అతనో జీనియస్ అని కితాబు ఇచ్చాడు. ఈ వయసులో అందరూ పదవీ విరమణ చేయాలని కోరుకుంటారని కానీ ఇప్పటికీ ధోనీ పూర్తి ఫిట్ నెస్ తో ఆడడం అద్భుతమని పేర్కొన్నాడు సల్మాన్ భట్.
ఐపీఎల్ ఆరంభంలో ఓటమి చవి చూసినా ఆ తర్వాత వరుస విజయాలతో దుమ్ము రేపుతూ చుక్కలు చూపించింది చెన్నై సూపర్ కింగ్స్. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఏకంగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది. 172 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక చేతులెత్తేసింది హార్దిక్ పాండ్యా సేన. దీంతో సీఎస్కే 15 పరుగులతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ జార్ఖండ్ డైనమెంట్.
ఆటగాళ్లను వాడుకున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తన నాయకత్వ నైపుణ్యానికి ఈ విజయం ప్రత్యక్ష ఉదాహరణ అని స్పష్టం చేశాడు సల్మాన్ భట్. పాండ్యాను వెనక్కి పంపించడంలో ధోనీ చేసిన ప్రయత్నం గొప్పదన్నాడు. ఈ సందర్భంగా ధోనీ ఎప్పటికీ మేధావి అని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇక ఈసారి ఐపీఎల్ టైటిల్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కే దక్కుతుందని జోష్యం చెప్పాడు సల్మాన్ భట్.
Also Read : Jairam Ramesh