WFI Chief : రెజ్ల‌ర‌పై ఉక్కుపాదం సింగ్ సంతోషం

కొన‌సాగిన అరెస్ట్ ల ప‌ర్వంపై ఆగ్ర‌హం

WFI Chief : నిత్యం హాట్ టాపిక్ గా మారారు యూపీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్. మోదీ చెప్పితే త‌ప్పా తాను ఎవ‌రికీ లొంగ‌న‌ని ప్ర‌క‌టించాడు. గ‌త కొన్నేళ్లుగా సింగ్ కింగ్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆయ‌నే భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య‌కు చీఫ్‌(WFI Chief). తాను సుప్రీం అని త‌న‌ను ఎవ‌రూ తొల‌గించ‌లేర‌ని హెచ్చ‌రిస్తున్నాడు. అంటే చ‌ట్టానికి అతీతుడిగా త‌న‌ను తాను ఊహించుకుటున్నాడు. ఇదే స‌మ‌యంలో తాను ఎలాంటి ప‌రీక్ష‌ల‌కైనా సిద్ద‌మేనంటున్నాడు.

మ‌రో వైపు మ‌హిళా రెజ్ల‌ర్లు గ‌త ఏప్రిల్ 23 నుంచి డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరుతూ నిర‌స‌న దీక్ష చేపట్టారు. తాజాగా నూత‌న భ‌వ‌న నిర్మాణం ప్రారంభం సంద‌ర్భంగా మ‌హిళా రెజ్ల‌ర్లు మ‌హిళా పంచాయ‌త్ కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున మ‌ద్ద‌తుదారులు త‌ర‌లి వ‌చ్చారు. ఈ త‌రుణంలో ఢిల్లీ పోలీసులు విరుచుకుప‌డ్డారు. మ‌హిళ‌ల‌ని చూడ‌కుండా దాడుల‌కు దిగారు.

అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. వైర‌ల్ గా మారాయి. తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ మాత్రం నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందు విక్ట‌రీ సింబ‌ల్ ను చూపిస్తూ ఫోటో దిగారు. దీనిపై నిప్పులు చెరిగారు విప‌క్షాలు. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

Also Read : MK Stalin

Leave A Reply

Your Email Id will not be published!