PT Usha Smriti Irani : పీటీ ఉష..స్మృతీ ఇరానీపై ఫైర్

మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై ఖాకీల దౌర్జ‌న్యం

PT Usha Smriti Irani : దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసులు దాడుల‌కు దిగ‌డం దేశ మంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్ , యూపీకి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ భ‌ర‌త్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ గ‌త ఏప్రిల్ 23 నుండి ఆందోళ‌న బాట ప‌ట్టారు.

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ చీఫ్, రాజ్య స‌భ ఎంపీ పీటీ ఉష తో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(PT Usha Smriti Irani) ఇప్ప‌టి దాకా స్పందించ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

నూత‌న భ‌వ‌న పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. దేశ వ్యాప్తంగా ఖాకీలు ప్ర‌వ‌ర్తించిన తీరు, దురుసు ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల యావ‌త్ దేశం విస్తు పోయింది. కేంద్రం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. లైంగిక‌, శారీర‌క వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ , ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ సింగ్ సైతం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

ఐఓసీ చీఫ్ గా పీటీ ఉష స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుండా గ‌డ‌ప దాటు ధోర‌ణి అవ‌లంభించ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌న‌స వ్య‌క్త‌మైంది. ఇక స్త్రీ, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీ సాటి మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై దాడులు జ‌రుగుతున్నా ఎందుకు స్పందించడం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఆందోళ‌న చేప‌ట్టిన బాధిత మ‌హిళ‌ల‌పై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం విస్తు పోయేలా చేసింది క్రీడా లోకాన్ని.

Also Read : TTD Rush

Leave A Reply

Your Email Id will not be published!