Sengol Comment : రాజ దండం ఎవ‌రి కోసం

ఎందుకింత‌టి ప్రాధాన్య‌త

Sengol Comment : దేశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని మించిన క‌మ్యూనికేట‌ర్ ఎవ‌రూ లేరంటే న‌మ్మ‌లేం. తాజాగా మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు . నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నంలో రాజ‌దండాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఈ రాజ‌దండం(Sengol)పైనే చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే వ్యంగంగా మోదీ రాజ దండం వంగి పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇంత‌లా ప్రాధాన్య‌త క‌లిగిన ఈ రాజ‌దండం అంటే ఏమిటి. ఎందు కోసం దీనిని ప్ర‌త్యేకంగా చ‌ట్టాలు రూపొందించే పార్ల‌మెంట్ భ‌వ‌నంలో ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసు కోవాల్సిందే. రాజదండం (Sengol) అనేది రాజ‌కీయ అధికారంపై నైతిక‌, ఆధ్యాత్మిక అధికారాన్ని సూచిస్తుంది. త‌ర త‌రాల నుంచి భార‌తీయ నాగ‌రిక‌తో సంప్ర‌దాయంగా ఉంటూ వ‌స్తోంది. ఒక‌ప్పుడు ప్రాచీన పాశ్చాత్య దేశాల‌లో రాజ‌రిక‌పు రాజ‌సంలో భాగంగా రాజ‌దండం కొన‌సాగుతూ వ‌చ్చింది. ఇక ప్ర‌స్తుత రాజ‌దండం ప‌ల్ల‌వులు, పాండ్యుల‌ను ఓడించి భారీ రాజ్యాన్ని స్థాపించిన త‌మిళ‌నాడు లోని తంజావూరు చోళుల ఐదు శ‌తాబ్దాల పాల‌నలో ఇది రాజ‌రిక అధికార మార్పిడికి చిహ్నంగా మారింది. రాజ గురువు, ఆస్థాన పూజారి ఒక చోళ రాజు నుండి మ‌రొక చోళ రాజుకు అధికార బ‌దిలీని తెలియ చేసేందుకు గుర్తుగా రాజదండంను(Sengol) ఉప‌యోగిస్తారు.

దీనిని మొద‌ట భారత దేశ తొలి ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూకు ఇవ్వ‌బ‌డింది. ఇక గ్రీకు, మెసొపొటేమియా నాగ‌రిక‌త‌ల కాలం నుంచి రాజ‌దండాలు కొన‌సాగుతూ వ‌చ్చాయి. 2022 సెప్టెంబ‌ర్ లో క్వీన్ ఎలిజ‌బెత్ -2 శ‌వ పేటిక‌పై రాజ దండాన్ని ఉంచారు. ఈనెల ప్రారంభంలో చార్లెస్ కింగ్ ప‌ట్టాభిషేకం స‌మ‌యంలో దీనిని ప్ర‌ద‌ర్శించారు. ఇక భార‌తీయ నాగ‌రిక‌త సంప్ర‌దాయంలో చ‌క్ర‌వ‌ర్తులు,రాఉలు ఎన్న‌డూ అత్యున్న‌త అధికారికంగా ప‌రిగ‌ణించ‌క పోవ‌డం విశేషం. ప‌ట్టాభిషేకం చేసే స‌మ‌యంలో ఆస్థాన పూజారులు ధ‌ర్మం, నైతిక‌, ఆధ్యాత్మిక క్ర‌మం మాత్ర‌మే స‌ర్వోన్న‌త‌మైన అధికారం అని గుర్తూ చేస్తూ వ‌చ్చారు. దానిని అర్థం చేయించేందుకు ప్ర‌య‌త్నించారు. రాజు అధికారికంగా సింహాస‌నాన్ని అధిరోహించిన త‌ర్వాత అదంస్యోస్మి అని మూడుసార్లు ప్ర‌క‌టిస్తాడు. దీని అర్థం ఏమిటంటే నన్ను ఎవ‌రూ శిక్షించ లేరు.

ఇదే స‌మ‌యంలో ఆస్థాన పూజారి ధ‌ర్మ దండంతో ముందుకు వ‌చ్చి రాజు కిరీటంపై త‌ట్టి ధ‌ర్మ దండియోసి అని దీవిస్తాడు. అంటే ధ‌ర్మం నిన్ను శిస్తుంద‌ని అర్థం. 1947లో ఇది కేవ‌లం ఆంగ్లేయుల వారి నుండి నెహ్రూకి అధికార మార్పిడికి ప్ర‌తీక‌గా నిల‌వ‌లేదు. త‌మిళ‌నాడు లోని మైలాడుతురై లోని తిరువ‌డుత్తులై అధీనంకు సంబంధించి రెండో క‌మాండ్ శ్రీ‌ల కుమార స్వామి తంబిరాన్ ద్వారా మౌంట్ బాటెన్ నుండి అధికారాన్ని తొలుత స్వాధీనం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్రిటీష్ వారు రాజ దండాన్ని ఇచ్చిన‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. స‌ద‌య్య‌ప స్వామి రాజ‌దండాన్ని మౌంట్ బాట‌న్ కు ఇచ్చార‌ని, తిరిగి అత‌డి నుండి పొందార‌ని, దానిపై ప‌విత్ర జ‌లం చ‌ల్లి దైవ నామ స్మ‌ర‌ణ చేసి పండిట్ నెహ్రూకి ఇచ్చి అధికారాన్ని చేప‌ట్టాల‌ని ఆశీర్వ‌దించిన‌ట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. త‌మిళ శైవ స‌న్యాసి తిరుజ్ఞాన సంబంధ‌ర్ ర‌చించిన తేవారం నుండి శ్లోకాలు ఆలాపించారు.

తాజాగా స్పీక‌ర్ పోడియం ప‌క్క‌నే కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో రాజ‌దండాన్ని(Sengol) ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ప్ర‌యాగ్ రాజ్ లోని ఆనంద్ భ‌వ‌న్ మ్యూజియంలో బంగారు పూత పూసిన 1947 పాత‌కాల‌పు వెండి రాజ దండాన్ని తిరిగి తీసుకు వ‌చ్చారు. పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వాన్ని ప్ర‌తిప‌క్షాలు బ‌హిష్క‌రించాయి. ఇది ప‌క్క‌న పెడితే సోష‌లిస్టుగా పేరు పొందిన నెహ్రూ రాజ‌దండాన్ని స్వీక‌రించార‌న్న అంశం మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారింది. ప్ర‌స్తుతం మోదీ రాజ దండం స్వీక‌రించిన రోజునే దేశానికి క్రీడ‌ల ప‌రంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మహిళా రెజ్ల‌ర్ల‌పై ఖాకీలు కండ‌కావ‌రం ఎక్కి విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడికి పాల్ప‌డ్డారు. అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. అందుకే సీఎం స్టాలిన్ మోదీని ప్ర‌శ్నించారు. దాడి చేసేందుకేనా రాజ దండం ఉన్న‌ది అంటూ ప్ర‌శ్నించారు.

Also Read : PT Usha Smriti Irani

Leave A Reply

Your Email Id will not be published!