Bank Holidays : జూన్ లో 12 రోజులు బ్యాంకులు బంద్
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్
Bank Holidays : వచ్చే నెల జూన్ నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు బంద్(Bank Holidays) కానున్నాయి. ఆ రోజుల్లో రోజూ వారీ కార్యకలాపాలకు నడవవు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయని తెలిపింది. ప్రతినెలా బ్యాంకులకు సంబంధించి సెలవులు ప్రకటిస్తుంది. తాజాగా జూన్ కు సంబంధంచి వివరాలు వెల్లడించింది.
సెలవుల్లో అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉంటాయి. బ్యంకు సెలవులు అక్కడ నిర్వహించే పండుగ లేదా ఆయా రాష్ట్రాల్లో నిర్దిష్ట సందర్భాల నోటిఫికేషన్ ను బట్టి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయని పేర్కొంది ఆర్బీఐ. నెగోషియబుల్ ఇన్ స్ట్రమెంట్ యాక్ట్ , హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ హాలిడే, బ్యాంక్ ల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అనే మూడు కేటగిరీల మధ్య సెలవులు ఇస్తారు.
జూన్ 2023 కోసం ఆర్బీఐ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెల ప్రాంతీయ సెలవుల కారణంగా బ్యాంకులు ఆరు రోజుల పాటు మూసి వేస్తారు. ఖర్చి పూజ, బక్రీద్ , రాజా సంక్రాంతి వంటి పండుగలు ఉన్నాయి. జూన్లో అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గో శనివారాలు పని చేయవని తెలిపింది ఆర్బీఐ. సెలవుల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. జూన్ 4న మొదటి ఆదివారం, 10 రెండవ శనివారం, 11న రెండో ఆదివారం, 18న మూడో ఆదివారం, 24న నాల్గవ శనివారం ఉన్నాయి. 25న నాల్గవ ఆదివారం,
15న రాజ సంక్రాంతి. ఐజ్వాల్ , భువనేశ్వర్ లో జరుపుతారు. 20న కాంగ్ రథ యాత్ర, 26న ఖర్చి పూజా, 28న బక్రీద్ , 29న ఈద్ ఉల్ అధా, 30న రెమ్నా ని సందర్బంగా సెలవులు ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేశారు.
Also Read : Immerse Medals