PM Modi Express : రైలు ప్రమాదం ప్రముఖుల సంతాపం
మోదీ, రాహుల్, కేజ్రీవాల్, స్టాలిన్ , జగన్
PM Modi Express : ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 237 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రుల్లోకి తరలించారు. ఒడిశా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు దేశానికి చెందిన ప్రముఖులు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi), ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే, తెలంగాణ సీఎం కేసీఆర్ , కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ , హర్యానా సీఎం ఖట్టర్ , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం రైలు దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బాల్ సోర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎక్కడ చూసినా హాహాకారాలతో నిండి పోయింది. సహాయక చర్యల్లో మునిగి పోయింది ఒడిశా ప్రభుత్వం. సీఎం నవీన్ పట్నాయక్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Odisha Train Accident