JP Nadda : తిరుపతిలో 10న బీజేపీ సభ
ఎన్నికల సమర శంఖమేనా
JP Nadda : ఏపీలో ఈసారి భారతీయ జనతా పార్టీ వినూత్నంగా ముందుకు వెళుతోంది. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరుగుతోంది. ఆ పార్టీకి చెందిన చీఫ్ సోము వీర్రాజుతో పాటు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా బీజేపీ అధినాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీపై. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుందా లేక ఎప్పటి లాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది. పవర్ స్టార్ బీజేపీ కంటే టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే ఏకంగా రెండు భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జూన్ 8న విశాఖ పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తమ పార్టీ స్టాండ్ ఏమిటో చెప్పనున్నారు.
ఇక ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లిన తిరుపతిలో ఈనెల 10న బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ సభలో తమ మేనిఫెస్టోను , తమ విధానాలను, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. మొత్తంగా బీజేపీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లే అనిపిస్తోంది. ఈ రెండు సభల ఏర్పాట్లపై ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు బిజీగా ఉన్నారు.
Also Read : Amit Shah