48 Trains Cancelled : 48 ట్రైన్స్ రద్దు 39 రైళ్లు దారి మళ్లింపు
ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద ఘటన
48 Trains Cancelled : ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొన్న ఘటనలో 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ప్రమాద ఘటనతో బోగీలు చెల్లా చెదురుగా పడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కేంద్ర రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు పలు రైళ్లను దారి మళ్లించింది. మొత్తంగా బాలా సోర్ రూట్ లో 48 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది(48 Trains Cancelled). మరో వైపు 39 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.
అంతే కాకుండా 10 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. తిరువనంతపురం – కోల్ కతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ , బెంగళూరు గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ , హౌరా తిరుపతి హంసఫర్ ఎక్స్ ప్రెస్ , కన్యాకుమారి దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ ప్రెస్ , హౌరా మైసూర్ ఎక్స్ ప్రెస్ కీలక రైళ్లు రద్దు చేసిన వాటిలో ఉన్నాయి.
Also Read : Ashwini Vaishnaw