CM MK Stalin : ప్ర‌మాద బాధితుల‌కు ఆర్థిక సాయం – స్టాలిన్

ఒడిశా దుర్ఘ‌ట‌న‌పై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

CM MK Stalin : ఒడిశా రైలు దుర్ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin). ఈ మేర‌కు ఆ ఘ‌ట‌న‌లో మృతి చెందిన త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌యాణీకుల‌కు ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు సీఎం. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు స్టాలిన్ శ‌నివారం చెన్నై లోని స్టేట్ ఎమ‌ర్జెన్సీ ఆప‌రేషన్ సెంట‌ర్ కు చేరుకున్నారు.

రైలు ఘ‌ట‌న‌కు సంబంధించి ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో మాట్లాడిన‌ట్లు చెప్పారు సీఎం . ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. బాలాసోర్ రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికీ రూ. 5 ల‌క్ష‌లు , తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ. 1 ల‌క్ష చొప్పున సాయం ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మాట్లాడినట్లు స్టాలిన్ తెలిపారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నుంచి అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు ఎంకే స్టాలిన్. ప్ర‌స్తుతానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మై ఉన్నాయ‌ని తెలిపారు.

త‌మ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఉద‌య‌నిధి స్టాలిన్ , శివ శంక‌ర్ , ఐఏఎస్ అధికారులు అక్క‌డికి వెళుతున్న‌ట్లు చెప్పారు సీఎం. అయితే ప్ర‌స్తుతానికి ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన లేదా గాయ‌ప‌డిన త‌మిళుల సంఖ్యకు సంబంధించి నిర్దిష్ట వివ‌రాలు లేవ‌న్నారు. త‌మ ఆఫీస‌ర్లు ఒడిశా ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నార‌ని తెలిపారు.

Also Read : 48 Trains Cancelled

Leave A Reply

Your Email Id will not be published!