MP Sanjay Singh : వందే భారత్ తప్ప భద్రత ఏదీ
నిప్పులు చెరిగిన సంజయ్ సింగ్
MP Sanjay Singh : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒడిశా రాష్ట్రం లోని బాలా సోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సంజయ్ సింగ్(MP Sanjay Singh) మీడియాతో మాట్లాడారు. కేంద్ర సర్కార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోదీ ప్రభుత్వం వందే భారత్ ట్రైన్స్ ను ప్రారంభించడంలో ఉన్నంత శ్రద్ద దేశంలోని రైళ్ల పటిష్టత, భద్రత గురించి పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాను రాజకీయంగా వ్యాఖ్యానించడం లేదని పేర్కొన్నారు. కేవలం ఒక భారతీయుడిగా తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా సంఖ్య రాలేదు. రైల్వే శాఖ విచారణకు ఆదేశించిందని అంటున్నారు. ప్రాణ నష్టం జరిగాక ఆదేశిస్తే ఏం లాభం అని నిలదీశారు సంజయ్ సింగ్.
ఇప్పటికే దేశంలోని వనరులను ధారాదత్తం చేశారు. ఇక మౌలిక సదుపాయాలను పక్కన పెట్టారని మండిపడ్డారు ఎంపీ. వందే భారత్ కు పచ్చ జెండా ఊపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశా రైలు ఘటనపై భారత దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆప్ ఎంపీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : Mallikarjun Khargee