Manmohan Singh : రైలు ప్రమాదం కేంద్రమే కారణం
మోదీపై నిప్పులు చెరిగిన మన్మోహన్ సింగ్
Manmohan Singh : దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడూ సౌమ్యంగా ఉండేందుకు ఇష్ట పడతారు. కానీ మొదటిసారిగా నోరు విప్పారు. తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై, దానికి బాధ్యత వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వాకంపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు. ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ లో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడాన్ని ప్రస్తావించారు.
కోట్లాది రూపాయల ఆదాయం, అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన భారతీయ రైల్వే శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. వందే భారత్ పేరుతో హల్ చల్ చేస్తూ, జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇందుకు బాధ్యత వహించ కూడదా అని ప్రశ్నించారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇది పూర్తిగా మానవ తప్పిదం తప్ప ఇంకొకటి కాదని పేర్కొన్నారు. సిగ్నల్ ఎవరు ఇచ్చారు. ఎందుకు రైలు పట్టాలు తప్పిందనే దానిపై ఇప్పటి వరకు రైల్వే శాఖ క్లారిటీ ఇవ్వలేక పోయిందని నిలదీశారు.
ఇందుకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృత దేహాలను ఎత్తడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కానీ వాళ్లు ఎందుకు నోరు ఎత్తి ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్. ప్రారంభోత్సవం తర్వాత చప్పట్లు కొల్లగొట్టిన వ్యక్తి ఈ ప్రమాదానికి ఎందుకు బాధ్యత వహించ కూడదంటూ ఫైర్ అయ్యారు .
Also Read : Gudivada Amarnath