Chandrababu Naidu : ట్రబుల్ షూటర్ తో చంద్రబాబు భేటీ
వచ్చే ఎన్నికల్లో పొత్తుపై చర్చ
Chandrababu Naidu : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా మాటల తూటాలు పేల్చిన నాయకులు ఇప్పుడు దోస్తీకి సై అంటున్నారు. తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో దోస్తీ కట్టిన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఉన్నట్టుండి రూట్ మార్చారు. ఆయన అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు.
ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగినట్లు సమాచారం. అమిత్ షా నివాసంలో వీరు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఏపీలో ప్రస్తుతం జగన్ రెడ్డి పాలన సాగుతోంది. కాంగ్రెస్ తో దోస్తీ కట్టిన చంద్రబాబు చివరకు ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా బీజేపీతో కటీఫ్ చేశారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో జగన్ రెడ్డిని ఢీకొనాలంటే బీజేపీతో పాటు జనసేన మద్దతు కూడా అవసరం.
ఈ సమావేశం రెండు మాజీ మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ , టీడీపీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు చేతులు కలపవచ్చనే ఊహాగానాలకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఈ భేటీ గంటకు పైగా సాగిందని, ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. పొత్తుపై నిర్ణయం తీసుకున్నారా లేదా అనే దానిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తో టీడీపీ తెగతెంపులు చేసుకున్న మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కాగా బీజేపతో బంధాన్ని సరిదిద్దు కోవడానికి తమ పార్టీ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
Also Read : Rahul Gandhi