CM Siddaramaiah : సీఎం సిద్దరామయ్య కామెంట్స్
ఆర్థిక స్టోమత ఉన్న వాళ్లు వదులుకుంటే బెటర్
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో లబ్దిదారులు ఎవరైనా ఉంటే మరోసారి ఆలోచించాలని కోరారు. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు అవసరం అవుతాయి. ఇందుకు సంబంధించి సీఎం ఆర్థికంగా ఉన్న వాళ్లు ఒకవేళ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పొంది ఉన్నట్లయితే లేదా అర్హులైన ఉన్నట్లయితే వాటిని వదులు కోవాలని సూచించారు. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడదన్నారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah).
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గ్యారెంటీ పేరుతో 5 హామీలను ఇచ్చింది. వాటిని ఈనెల 11 నుంచి కొన్నింటిని, మరికొన్నింటిని జూలై 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు సీఎం. ఇందులో భాగంగా మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 65 సీట్లకే పరిమితమైంది భారతీయ జనతా పార్టీ . నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ నలుగురు సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.
ప్రస్తుతం ప్రజా సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు సిద్దరామయ్య. నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి, ఒంటరి మహిళలకు పెన్షన్ , గృహ మిత్ర, అన్నార్థులకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు సీఎం.
Also Read : Prabhas Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్