Bandi Sanjay : దొర పాలనలో నిలువు దోపిడీ – బండి
సీఎంపై నిప్పులు చెరిగిన బీజేపీ స్టేట్ చీఫ్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో నయా నైజాం నవాబును తలపింప చేశాడని ఆరోపించారు. నిరంకుశత్వానికి, రాచరికానికి పరాకాష్టగా మారిందని ధ్వజమెత్తారు బండి సంజయ్.
ప్రజలు దోపిడీకి లోను కాగా , కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు అంతకంతకూ పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణకు రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేదని కానీ ఇవాళ రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లకు చేరుకుందని షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ చీఫ్.
కేసీఆర్ కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు వచ్చాయని ధ్వజమెత్తారు. దొరకు సీఎం , కొడుక్కి ఐటీ, అల్లుడికి మంత్రి, బిడ్డకు ఎమ్మెల్సీ, ఇంకోడికి రాజ్యసభ సీటు దక్కిందని మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వాకం కారణంగా నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో కేసీఆర్ పార్టీకి రెండు ఆఫీసులు, కానీ పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని ఆరోపించారు. ఈవో 111 ద్వారా కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములు చట్టబద్దం చేసుకున్నాడని మండిపడ్డారు. ధరణి జనం పాలిట శనిలా దాపురించిందని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్.
Also Read : Byjus Case : రెడ్ వుడ్ సంస్థపై బైజూస్ కేసు
