Raghav Chadha : రాఘ‌వ్ చ‌ద్దాకు రాజ్య‌స‌భ‌ షాక్

బంగ్లా చేయాల‌ని ఆదేశం

Raghav Chadha : రాజ్య‌స‌భలో ఎంపీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘ‌వ్ చద్దాకు(Raghav Chadha) కోలుకోలేని షాక్ త‌గిలింది. వెంట‌నే త‌న‌కు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా రాజ్య‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ ఆదేశించింది. 34 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన రాఘ‌వ్ చ‌ద్దా ఇటీవ‌లే ప్ర‌ముఖ న‌టి ప‌రిణీతి చోప్రాతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆయ‌న ఎంపీగా గెలుపొందిన వెంట‌నే ఢిల్లీ లోని పండారా రోడ్ లోని బంగ్లాను రాఘ‌వ్ చ‌ద్దాకు 2022లో కేటాయించారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజ్య‌స‌భ‌. రాఘ‌వ్ చ‌ద్దా అధికారిక బంగ్లా కేటాయింపును ర‌ద్దు చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వివాదం హైకోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంది.
కాగా బంగ్లా అనేది ఎంపీ గ్రేడ్ కంటే ఎక్కువ అని పేర్కొంది. మ‌రో వైపు పేరెంట్స్ తో క‌లిసి బంగ్లాలో ఉంటున్న రాఘ‌వ్ చ‌ద్దాను న్యాయ ప‌ర‌మైన ప్ర‌క్రియ లేకుండా బ‌య‌ట‌కు పంప‌డం సాధ్యం కాద‌ని పాటియాలా కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇది అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఎంపీని బ‌య‌ట‌కు పంప‌డం అనేది న్యాయ బ‌ద్దం కాదు. ఒక‌వేళ పంపిన‌ట్ల‌యితే ఇది కోలుకోలేని గాయం అవుతుంద‌ని జిల్లా జ‌డ్జి సుధాన్షు కౌశిక్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కేసుకు సంబంధించి త‌దుప‌రి విచార‌ణ జూలై 10కి వాయిదా వేసింది. ఇదిలా ఉండ‌గా రాజ్య‌స‌భ హౌసింగ్ క‌మిటీకి సార‌థ్యం వ‌హిస్తున్న సీఎం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తొలిసారి ఎంపీగా ఎన‌నికైన రాఘ‌వ్ చ‌ద్దాకు టైప్ 7 బంగ్లాలో ఉండే అర్హ‌త లేద‌న్నారు. దీనిని కేవ‌లం కేంద్ర మంత్రులు, మాజీ గ‌వ‌ర్న‌ర్లు , మాజీ సీఎంల‌కు కేటాయిస్తార‌ని తెలిపారు.

Also Read : DK Shiva Kumar : రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!