S Jai Shankar Slams : కెన‌డాకు ఇది మంచిది కాదు – జై శంక‌ర్

ఇందిరా గాంధీ హ‌త్య వేడుక‌పై స్పంద‌న

S Jai Shankar Slams : దివంగ‌త ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఆమెను అంగ ర‌క్ష‌కులు కాల్చి చంపారు. సిక్కులు తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. తాజాగా ఈ హ‌త్య‌ను ఒక వేడుక‌గా ప‌రేడ్ చేప‌ట్టారు కెన‌డాలోని బ్రాంప్ట‌న్ న‌గ‌రంలో. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు స్పందించ‌డం లేదంటూ నిల‌దీశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు జై రాం ర‌మేష్ , ముర‌ళీ దేవ‌రా.

గురువారం తీవ్రంగా స్పందించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar). ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ఒట్టావా లోని భార‌త హైక‌మిష‌న్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఖ‌లిస్తాన్ అనుకూల వాద‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌లు ఈ మ‌ధ్య‌న కెన‌డాలో ఎక్కువై పోయాయి. త‌మ స‌హ‌నాన్ని తేలిక‌గా తీసుకోవ‌ద్దంటూ కోరారు ఎస్ జై శంక‌ర్.

త‌మ ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. వేర్పాటు వాదుల‌కు, తీవ్ర‌వాదుల‌కు, ఉగ్ర‌వాదుల‌కు ఒక‌టే ప‌ని. భార‌త దేశం ప‌ట్ల వ్య‌తిరేక భావ‌న‌ను ప్ర‌పంచానికి తెలియ చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని ఇది ఎంత మాత్రం వ‌ర్క‌వుట్ కాద‌న్నారు. తాము ప్ర‌తి అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంద‌న్నారు. చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. కెన‌డా ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. తాము ఎవ‌రు ప‌రేడ్ నిర్వ‌హంచార‌నే దానిపై ఆరా తీస్తున్నామ‌ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Also Read : Raghav Chadha : రాఘ‌వ్ చ‌ద్దాకు రాజ్య‌స‌భ‌ షాక్

Leave A Reply

Your Email Id will not be published!