Birsa Munda : నిప్పు కణం బిర్సా ముండా
ఆంగ్లేయులను వణికించిన యోధుడు
Birsa Munda : ఆంగ్లేయులకు చుక్కలు చూపించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా(Birsa Munda). తక్కువ కాలం మాత్రమే జీవించినా పది కాలాల పాటు గుర్తు పెట్టుకునేలా పోరాడిన ధీరోదాత్తుడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎదిరించాడు. ఆది వాసీలను సమీకరించాడు. వారిని చైతన్యవంతం చేశాడు. ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు. అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా మారాడు.
గిరిజనులకు సంబంధించి భూమి హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ డిమాండ్ చేశాడు బిర్సా ముండా. పట్టుమని ఈ నేల మీద కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించాడు. కానీ కాలం ఉన్నంత వరకు బిర్సా బతికే ఉంటాడు. గిరిజన నాయకుడిగా, స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తింపు పొందాడు. తనదైన ముద్ర కనబర్చాడు బిర్సా ముండా.
బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల సంచరించాడు. నిత్య చైతన్య దీప్తితో కదిలిన బిర్సా గురించి ఎంత చెప్పినా తక్కువే. జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపించాడు బిర్సా ముండా. ఆయన పుట్టిన రోజుకు గుర్తుగా 2000వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది.
నవంబర్ 15, 1875లో పుట్టిన బిర్సా ముండా జూన్ 9, 1900లో లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. 1886 నుండి 1890 దాకా మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వంతంగా గిరిజనులను సైనికులుగా మార్చాడు బిర్సా ముండా. మార్చి 3, 1900న జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో మాటు వేసి అరెస్ట్ చేశారు బ్రిటీష్ సైనికులు. జైలులో 9న తుది శ్వాస విడిచాడు బిర్సా ముండా.
తన జీవిత కాలమంతా ఆదివాసీల బాగు కోసం పరితపించిన యోధుడు బిర్సా ముండా(Birsa Munda). కోట్లాది ప్రజల ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ భూమి పవిత్రమైనదని, ఇది అడవి బిడ్డలకు మాత్రమే చెందిందని నినదించాడు బిర్సా ముండా.
భారత దేశ చరిత్రలో ఆదివాసీల పరంగా అతడిని యోధుడిగా కొలుస్తారు. ఆ పోరాట వీరుడికి మరణం లేదు. ఇవాళ ఆయన వర్దంతి. యావత్ దేశం సలాం చేస్తోంది బిర్సా ముండాకు. గిరిజన బిడ్డలు స్మరించుకుంటున్నారు. సలాం చేస్తున్నారు.
Also Read : IND vs AUS WTC Final : చెలరేగిన బౌలర్లు తలవంచిన బ్యాటర్లు