IND vs AUS WTC Final : చెల‌రేగిన బౌల‌ర్లు త‌ల‌వంచిన బ్యాట‌ర్లు

ఆసిస్ ధాటికి భార‌త్ విల విల

IND vs AUS WTC Final : ఇంగ్లండ్ లోని ఓవెల్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(IND vs AUS WTC Final) మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 5 వికెట్లు కోల్పోయి 151 ర‌న్స్ చేసింది. ఆశ‌ల‌న్నీ అజింక్యా ర‌హానే మీద ఉన్నాయి. ర‌వీంద్ర జ‌డేజా ఒక్క‌డే ప‌ర్వాలేద‌ని అనిపించాడు. మిగ‌తా వాళ్లంతా క్యూ క‌ట్టారు పెవిలియ‌న్ దారి ప‌ట్టారు.

ప్ర‌ధానంగా ఆసిస్ బౌల‌ర్ల ధాటికి ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఇప్ప‌టికే మ‌న జ‌ట్టు గురించి ఆసిస్(Australia) మాజీ స్టార్ ప్లేయ‌ర్ గ్రెగ్ చాపెల్ చెప్పినట్టుగానే మ‌నోళ్లు వికెట్ల‌ను పారేసుకున్నారు. మొద‌టి రోజు ఆధిక్యం ప్ర‌ద‌ర్శించిన ఆసిస్ సేమ్ సీన్ కంటిన్యూ చేసింది రెండో రోజు కూడా. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఐపీఎల్ లో దుమ్ము రేపిన శుభ్ మ‌న్ గిల్ తేలి పోయాడు. కేవ‌లం 13 ప‌రుగులు చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎప్ప‌టి లాగే 15 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ బాట పట్ట‌గా దంచి కొడ‌తాడ‌ని అనుకున్న విరాట్ కోహ్లీ సైతం చేతులెత్తేశాడు. కేవ‌లం 14 ర‌న్స్ చేశాడు. క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌ధాన వికెట్లు కోల్పోయిన త‌రుణంలో ఆదుకున్నాడు ర‌వీంద్ర జ‌డేజా. 51 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 48 ర‌న్స్ చేశాడు. అత‌డికి తోడుగా అజింక్యా ర‌హానే త‌న‌దైన శైలిలో ఆడుతున్నాడు. 4 ఫోర్ల‌తో 29 ప‌రుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

ప్ర‌స్తుతం శ్రీ‌క‌ర్ భ‌రత్ తో క‌లిసి ఏ మేర‌కు ప‌రుగులు చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప్ర‌త్య‌ర్థి స్కోర్ ను దాటాలంటే ఇంకా 318 ర‌న్స్ చేయాలి. చేతిలో 5 వికెట్లు మాత్ర‌మే ఉన్నాయి. అంత‌కు ముందు 3 వికెట్లు కోల్పోయి 327 ప‌రుగుల‌తో క్రీజులోకి వ‌చ్చిన ఆసిస్ బ్యాట‌ర్లు భారీ స్కోర్ సాధించారు. ట్రావిస్ హెడ్ 163 ర‌న్స్ చేస్తే స్మిత్ 121 ర‌న్స్ చేశాడు. స్మిత్ త‌న కెరీర్ లో 31వ సెంచ‌రీ చేశాడు. ఇందులో 25 ఫోర్లు ఉన్నాయి. ఆఖ‌రున వ‌చ్చిన అలెక్స్ భార‌త బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. 7 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 48 ర‌న్స్ చేశాడు.

Also Read : Om Raut Kiss Comment : ‘ముద్దు’ రాద్ధాంతం ‘ఓం’ ఛీత్కారం

Leave A Reply

Your Email Id will not be published!