Nara Lokesh : ఆద‌రించిన రాయ‌ల‌సీమ‌కు అభివంద‌నం

భావోద్వేగానికి లోనైన నారా లోకేష్ బాబు

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భావోద్వేగానికి లోన‌య్యారు. తాను చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లో ముగిసింది. నెల్లూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అక్కున చేర్చుకుని, ఆద‌రించిన క‌రువు నేలగా వినుతికెక్కిన రాయ‌ల సీమకు రుణ‌ప‌డి ఉన్నాన‌ని పేర్కొన్నారు. వెళుతూ ఈ ప‌విత్ర‌మైన నేల‌కు న‌మ‌స్క‌రించారు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు నారా లోకేష్.

ఆయ‌న‌కు అడుగడుగునా జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. యాత్ర‌లో భాగంగా వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు. వారికి అండ‌గా నిలుస్తాన‌ని ప్ర‌క‌టించారు. జ‌నం గోడును అర్థం చేసుకోని జ‌గ‌న్ సీఎంగా ఉన్నా లేన‌ట్టేన‌ని ఎద్దేవా చేశారు నారా లోకేష్(Nara Lokesh). ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, త్వ‌ర‌లో తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని ఆరోజు తాము ఏమిటో చూపిస్తామ‌న్నారు.

ఇవాళ ఈ యాత్ర సంద‌ర్బంగా త‌న దృష్టికి తీసుకు వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను తాను ప‌దిలంగా భ‌ద్ర ప‌ర్చుకున్నాన‌ని అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా నారా లోకేష్ చేప‌ట్టిన యాత్ర నిన్న‌టితో సీమ‌లో ముగిసింది. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 125 రోజులు పూర్తి చేశారు. బుధ‌వారం నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇది వ‌రుస‌గా 126 వ రోజు కావ‌డం విశేషం.

Also Read : KTR IT HUBS : ఐటీ హ‌బ్ లు కొలువుల‌కు దారులు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!