Priyank Kharge : ఐటీ రంగంపై ప్రియాంక్ ఖర్గే ఫోకస్
సమీక్షించిన కర్ణాటక మంత్రి
Priyank Kharge : కర్ణాటకలో మంత్రిగా కొలువు తీరిన ప్రియాంక్ ఖర్గే కార్య రంగంలోకి దూకారు. ఇప్పటికే ఆయన పంచాయతీరాజ్ తో పాటు ఐటీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వచ్చీ రావడంతోనే ఇరు శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా భారత దేశంలో ఐటీ రంగం పరంగా చూస్తే కర్ణాటక ముందంజలో ఉందన్నారు. మరో వైపు మారుతున్న టెక్నాలజీని మరింత అవగాహన కల్పించేలా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రియాంక్ ఖర్గే.
ఎప్పటికప్పుడు అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు నైపుణ్యం, వ్యవస్థాపకత , పర్యావరణ వ్యవస్థలను సృష్టించడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయక సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge). మరిన్ని కంపెనీలు కొలువు తీరేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే ఐటీ సెక్టార్ కు సంబంధించి బెంగళూరు నగరం ఇండియన్ సిలికాన్ వ్యాలీ సిటీగా పేరు పొందిందని దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడ్డారు మంత్రి ప్రియాంక్ ఖర్గే. కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీలకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు.
టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని పాలనా పరంగా మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Rahul Gandhi : రాహుల్ కు ఛాన్స్ ఇస్తే బెటర్ – ఉమైర్