YS Sharmila KCR : బీఆర్ఎస్ డేంజరస్ వైరస్ – షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ కామెంట్స్
YS Sharmila KCR : తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని మించిన డేంజరస్ వైరస్ ఏదీ లేదని సంచలన కామెంట్స్ చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. గురువారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. కరోనా కంటే మించిన వైరస్ లు వస్తాయని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారంటూ ఎద్దేవా చేశారు.
చేతకాని పాలన కూడా ఓ వైరస్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను పీడించడం, దోచుకోవడం, దాచు కోవడం కొత్త వైరస్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ చేశారని ఇక మిగిలింది అప్పులు తప్ప అభివృద్ది ఎక్కడ ఉందంటూ నిలదీశారు.
ఏం సాధించారని తెలంగాణ పేరుతో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారంటూ నిలదీశారు. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ఏర్పడిన తెలంగాణకు 14,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండేదని కానీ ఇవాళ రూ. 5 లక్షల కోట్లకు పైగా అప్పులు పేరుకు పోయాయరని ఆవేదన వ్యక్తం చేశారు.
కోరోనా తో పోరాడి గెలిచామేమో కానీ ఇప్పుడు ఉన్నబీఆర్ఎస్ వైరస్ ను తట్టుకోవడం ఎవరి తరం కాదన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila). నిమ్స్ విస్తరణకు కొబ్బరికాయ కొట్టారు కానీ గతంలో చేసిన శంకుస్థాపనల గురించి ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Pawan Kalyan : ప్రజా సమస్యలపై పోరు బాట