Chandrababu Naidu : నా ల‌క్ష్యం పేద‌రికం లేని స‌మాజం

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు

Chandrababu Naidu : పేద‌రికం లేని స‌మాజం త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అస‌మాన‌త‌లు లేని దేశాన్ని నిర్మించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. వినూత్న సాంకేతిక‌త‌లు, విధ‌నాఆల ప్ర‌భావంత‌మైన అమ‌లు చేయ‌డం వ‌ల్ల పేదరికం నుంచి గ‌ట్టెక్క‌గ‌ల‌మ‌ని అన్నారు. గ్లోబ‌ల్ ఫోర‌మ్ ఫ‌ర్ స‌స్టైన‌బుల్ ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ (జీఎఫ్ఎస్టీ) ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో సెమినార్ నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారితో సుదీర్ఘంగా సంభాషించారు మాజీ సీఎం. ప్ర‌తి పౌరుడు గౌరవ ప్ర‌దంగా , సంతృప్తితో జీవించే పేద‌రికం లేనిన స‌మాజాన్ని సాధించేందుకు బ్లూ ప్రింట్ ను త‌యారు చేయాల‌ని సూచించారు. నిపుణులు, మేధావులు ప‌లు సూచ‌న‌లు అంద‌జేశారు.

ఈ దేశం కోసం దాని బాగు కోసం ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు బాధ్య‌త‌గా పాలు పంచు కోవాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). దేశ పురోగ‌తి కోసం భ‌విష్య‌త్ విధానాల‌ను రూపొందించ‌డంలో స‌హాయ ప‌డేందుకు జీఎఫ్ఎస్టీ బ్లూ ప్రింట్ ను జీఓఐతో పంచుకుంటుంద‌ని తెలిపారు మాజీ సీఎం. కాగా జీఎఫ్ఎస్టీ సంస్థ‌కు గౌర‌వ చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌తి ఏటా స‌ద‌స్సులు నిర్వ‌హిస్తుంది.

Also Read : Rahul Gandhi : పిఎస్‌యులు నిర్వీర్యం రాహుల్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!